![]() |
![]() |

సౌత్ ఇండియన్ ఆడియన్స్ హిందీ సినిమాలను యాక్సెప్ట్ చేయరనే మాట మళ్లీ షాహిద్ కపూర్ ముందుకొచ్చింది. ఈ సారి ఈ విషయం గురించి మరింత స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు షాహిద్. ఆయన నటించిన బ్లడీ డాడీ విడుదల కానున్న సందర్భంగా ఆయన ఆడియన్స్ తో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించారు.
ఈ చాట్‌లో పాల్గొన్న ఓ నెటిజన్ "సార్ మీరు సౌత్ ఇండియన్ ఆడియన్స్ హిందీ సినిమాలను చూడరు అని అన్నారు కదా. అలా ఎందుకన్నారు? బావున్న ప్రతి సినిమానూ సౌత్ ఇండియన్స్ చూస్తారు. మాకు సినిమాలంటే ఇష్టం సర్" అని అన్నారు.
దీనికి వెంటనే స్పందించారు షాహిద్ "అఫ్ కోర్స్. నాకు కూడా సౌత్ ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం. లాక్‌డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను. ఇప్పుడు సినిమా ఐడియాలన్నీ యూనివర్శల్. దానికి బౌండరీలు ఉండటం లేదు అన్నదే నా ఉద్దేశం. భారతీయ భాషల్లోనూ, భారతీయ నటుల్లోనూ అలాంటి బౌండరీలు అసలు లేవు. థాంక్యూ" అంటూ సమాధానం ఇచ్చారు.
గత వారం ఈ సినిమా ప్రమోషన్లలోనే ఆయన సౌత్ ఇండియా ఆడియన్స్ హిందీ సినిమాలను ఆదరించాలని కోరుకున్నారు. ఉత్తరాది వారందరూ దక్షిణాది సినిమాలను ఆదరిస్తున్నారని, అదే తీరు ఇక్కడ కూడా రావాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించే ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
తమిళంలో కమల్‌హాసన్ నటించిన ఉన్నైపోల్ ఒరువన్ కథతో తెరకెక్కుతోంది బ్లడీ డాడీ. ఈ సినిమా తర్వాత కృతి సనన్‌తో ఓ రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాకు ఇంకా పేరు అనౌన్స్ చేయలేదు.
![]() |
![]() |